News April 11, 2025
అమెరికాలో క్రిస్‌మస్ సంబరాలపై ట్రేడ్ వార్ ఎఫెక్ట్..?

US, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ అమెరికాలో క్రిస్‌మస్ సంబరాలపై పడేలా కనిపిస్తోంది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు వినియోగించే డెకరేషన్ వస్తువులు 87శాతం వరకూ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. కాగా ఇప్పుడు పెరిగిన సుంకాలతో వాటి ధరలు రెట్టింపవుతాయి. కనుక ఈ వస్తువులను కొనడం అమెరికన్లకు చాలా భారంగా మారుతుంది. ఏప్రిల్‌లోనే ఆర్డర్స్ రావాల్సి ఉన్నా ఈ సుంకాల పెంపుతో ఇప్పటివరకూ రాలేదని చైనా కంపెనీలు అంటున్నాయి.
Similar News
News April 17, 2026
ఉమ్మడి కరీంనగర్‌లో జనాభా వివరాలు ఇలా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం జనాభా 33,26,410 మందిగా సర్వేలో తేలింది. ఇందులో జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా 10,19,151 మంది ఉండగా, KNR జిల్లాలో 10,10,464, పెద్దపల్లి జిల్లాలో 7,28,802, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యల్పంగా 5,67,993 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా BCలు 22,34,494 (67.18%)తో ముందుండగా, SCలు 6,56,230 (19.72%), STలు 88,120 (2.65%), OCలు 3,47,566(10.45%) మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
News April 17, 2026
ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.
News April 17, 2026
యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


