News November 14, 2024

డ్రంక్&డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ!

image

TG: సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, బిజినెస్‌మ్యాన్ జైపాల్‌రెడ్డిను HYDలోని మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడపడంతో పాటు SRనగర్ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించకుండా అధికారులను ఏసీపీ అడ్డుకున్నట్లు సమాచారం.

Similar News

News January 18, 2026

మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.

News January 18, 2026

ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.

News January 18, 2026

APPLY NOW: SAILలో ఉద్యోగాలు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>)కు చెందిన బర్న్‌పుర్ హాస్పిటల్‌లో 22కన్సల్టెంట్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, పీజీ డిప్లొమా/పీజీ డిగ్రీ/DNB/DM/MCh/DrNB/DIH అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జనవరి 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sailcareers.com/