News September 22, 2024
ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్, ర్యాష్ డ్రైవింగ్.. ఆర్టీసీపై విమర్శలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ లోకల్ బస్ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోతో ఓ నెటిజన్ పోలీసు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News October 27, 2025
కుక్కల వ్యవహారం.. సీఎస్‌లకు సుప్రీం సమన్లు

దేశవ్యాప్తంగా వీధి కుక్కల కేసులో తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌లు హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను Nov 3కు వాయిదా వేసింది. కాగా కుక్కల వ్యవహారంలో TG, WB మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి.
News October 27, 2025
మిరప ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాల వల్ల పూత, కాత దశలో ఉన్న పచ్చిమిచ్చిలో శనగపచ్చ పురుగు, కాల్షియం లోపం, వేరుకుళ్లు సమస్యలు వస్తాయి. మిరపలో శనగపచ్చ పురుగు నివారణకు లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3mlను కలిపి పిచికారీ చేయాలి. కాల్షియం, ఇతర సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి ఆగ్రోమిన్ మాక్స్ (ఫార్ములా-6) 5 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
News October 27, 2025
భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.


