News September 22, 2024
ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్, ర్యాష్ డ్రైవింగ్.. ఆర్టీసీపై విమర్శలు
ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ లోకల్ బస్ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోతో ఓ నెటిజన్ పోలీసు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News October 14, 2024
BREAKING: భారత్ ఓటమి.. WC నుంచి ఔట్?
T20 WC: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 142 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (54*) చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. లాస్ట్ ఓవర్లో టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. రేపు PAKపై జరిగే మ్యాచులో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఇంటికి వెళ్లినట్లే.
News October 14, 2024
భూకేటాయింపులపై ఖర్గే కీలక నిర్ణయం!
ముడా స్కాంలో కర్ణాటక CM సిద్ధ రామయ్యపై ED కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు KT ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలను తిరిగివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూకేటాయింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇందులో అవకతవకలు జరిగాయంటూ ఓ వ్యక్తి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
News October 13, 2024
కన్నడ బిగ్‌బాస్‌కు పోలీసుల షాక్!
కన్నడ బిగ్‌బాస్‌లో స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం నరకంలో ఉన్న కంటెస్టెంట్లకు ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చేవారు. బాత్రూమ్కి వెళ్లాలన్నా ‘స్వర్గం’ కంటెస్టెంట్ల అనుమతి తీసుకోవాలి. దీంతో షోలోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నాగలక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు.