News January 14, 2025

మహా కుంభమేళాలో విషాదం

image

మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News February 18, 2025

మహిళలు, BC, SC, STలకు శుభవార్త

image

AP: సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకునే మహిళలు, BC, SC, ST, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు GOVT శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే SC, STలకు భూమి విలువలో 75% రాయితీ(గరిష్ఠంగా ₹25L) కల్పిస్తూ మరో GO ఇచ్చింది.

News February 18, 2025

ఈకలు లేని కోడిని చూశారా?

image

AP: సాధారణంగా ఏ కోడికైనా ఈకలు ఉండటం సహజం. అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని నాటు కోడి ఆశ్చర్యపరుస్తోంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందని, దీని వయసు 6 నెలలని యజమాని ఇస్మాయిల్ చెప్పారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదైన లక్షణాలు కోళ్లలో ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.

News February 18, 2025

హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్

image

TG: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

error: Content is protected !!