News September 14, 2024
విషాదం: టీ పౌడర్ అనుకొని..

AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News December 16, 2025
బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో ఉద్యోగాలు

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(BRIC)12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 21వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో 6 పోస్టులను రెగ్యులర్గా, 6 పోస్టులను డిప్యుటేషన్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://dbtindia.gov.in
News December 16, 2025
విష్ణు పూజలో తులసి ఆకుల విశిష్టత

శ్రీ మహావిష్ణువు పూజల్లో తులసి ఆకులను ఉపయోగించడం అత్యంత శ్రేయస్కరమని అంతా భావిస్తారు. అయితే అంత పవిత్రమైన ఆ తులసి ఆకులను ఒకసారి పూజకు వాడిన తర్వాత శుద్ధి చేసి మరొకసారి కూడా వాడుకోవచ్చని పండితులు చెబుతున్నారు. దేవుడికి సమర్పించిన తులసి ఆకులను తీసివేయవలసి వచ్చినప్పుడు, వాటిని ఎప్పుడూ చెత్తలో వేయకూడదంటున్నారు. పారే నీటిలో, శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే వేయాలని, గౌరవించాలని సూచిస్తున్నారు.
News December 16, 2025
తెలంగాణ మొత్తం అప్పు ₹4,42,297 కోట్లు

TG: రాష్ట్రం అప్పు మొత్తం ₹4,42,297 కోట్లకు చేరినట్లు RBI తాజా రిపోర్ట్ ప్రకటించింది. ‘2024లో ₹3.93L కోట్లు కాగా 2025 మార్చినాటికి మరో ₹50వేల కోట్లు పెరిగింది. ఇందులో స్టేట్ డెవలప్మెంట్ లోన్గా ₹3.58L కోట్లు, పవర్ బాండ్లతో ₹7100 CR, NSSF నుంచి ₹3334 CR, నాబార్డు నుంచి ₹5390CR, బ్యాంకుల నుంచి ₹3వేల Cr, కేంద్రం నుంచి ₹14727 CR, PF నుంచి ₹16,700 CR రుణం తీసుకుంది’ అని పేర్కొంది.


