News September 14, 2024
విషాదం: టీ పౌడర్ అనుకొని..
AP: తూ.గో జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున వృద్ధదంపతులు పురుగుమందు కలిపిన టీ తాగి చనిపోయారు. రాజానగరం(M) పల్లకడియంకు చెందిన గోవింద్(75), అప్పాయమ్మ(70) ఇంటిముందు ఓ కోతి పురుగుమందు ప్యాకెట్ తీసుకొచ్చి పడేసింది. కంటిచూపు మందగించిన అప్పాయమ్మ దాన్ని టీపౌడర్ అనుకొని టీ పెట్టి భర్తకిచ్చి, తానూ తాగింది. కాసేపటికే నురగలు కక్కుతూ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News October 5, 2024
ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తా: గోపీచంద్
తాను చేసిన విలన్ పాత్రలు బలమైన ముద్ర వేశాయని, అందుకే ఫ్యాన్స్ తనను మళ్లీ ఆ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నారని హీరో గోపీచంద్ అన్నారు. ప్రభాస్ సినిమాలో అయితేనే తాను విలన్‌గా నటిస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్‌కు ముందే తెలిసిపోతుందని, కానీ నమ్మకంగా ప్రమోషన్ చేస్తామని చెప్పారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆయన నటించిన ‘విశ్వం’ మూవీ ఈనెల 11న రిలీజ్ కానుంది.
News October 5, 2024
భయానకం.. 600 మందిని కాల్చేశారు
ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో భయానక ఘటన చోటుచేసుకుంది. బర్సాలోగోలో అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ JNIM దాడుల్లో గంటల వ్యవధిలోనే 600 మంది ప్రజలు చనిపోయారు. AUG 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌లపై వచ్చిన దుర్మార్గులు కనిపించినవారినంతా కాల్చేశారు. ఆ మృతదేహాలను తొలగించడానికి 3 రోజలు పట్టింది. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20వేల మంది మరణించారు.
News October 5, 2024
దసరా సెలవుల్లోనూ క్లాసులు.. విద్యార్థుల ఆవేదన
AP: ఈ నెల 2 నుంచే దసరా సెలవులు ప్రారంభమైనా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరుకావాలని విద్యార్థులకు స్పష్టం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సెలవులతో సిలబస్ పూర్తికాలేదనే నెపంతో పిల్లలకు దసరా ఆనందాలను దూరం చేస్తున్నాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.