News April 6, 2025

విషాదం.. నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి

image

AP: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అవనిగడ్డ మండలం కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు చనిపోయారు. మృతులను మోదుమూడి గ్రామానికి చెందిన మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15)గా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News April 10, 2025

IPLలో ఒకే ఒక్కడు

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా IPLలో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761) ఉన్నారు.

News April 10, 2025

నర్సింగ్ విద్యకు కామన్ ప్రవేశ పరీక్ష: మంత్రి

image

AP: నర్సింగ్‌కు 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.

News April 10, 2025

స్లాట్ బుకింగ్‌కు అనూహ్య స్పందన: మంత్రి పొంగులేటి

image

TG: ప్రజలకు సులువుగా, వేగవంతంగా సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానానికి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ప్రయోగాత్మకంగా చేపట్టిన 22 చోట్ల 626 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించారు. ఈ విధానంలో దళారుల ప్రమేయం ఉండబోదని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు.

error: Content is protected !!