News September 23, 2024

ఉడత వల్ల రద్దయిన రైలు

image

ట్రైన్‌లోకి ఎక్కిన ఓ ఉడత వల్ల ఏకంగా రైలు రద్దయింది. బ్రిటన్‌లోని గోమ్‌షాల్‌ స్టేషన్‌లో 2 ఉడతలు రైలు ఎక్కాయి. అటుఇటు పరిగెత్తడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ‘టికెట్ లేకుండా రైలెక్కి నిబంధనలు ఉల్లంఘించాయి. రైలు నుంచి దింపేందుకు ఎంత ప్రయత్నించినా అందులో ఒకటి దిగలేదు. దీంతో రైలును నిలిపివేశాం’ అని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.

Similar News

News October 12, 2024

వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతాం: భట్టి

image

TG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల రాకతో గురుకులాలు మూత పడతాయన్నది అబద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉన్న వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో కలుపుతామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా సిలబస్ తయారు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

News October 12, 2024

BIG ALERT: అతి భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరుసటి రోజుకు తీవ్ర తుఫానుగా మారి తమిళనాడులో తీరం దాటవచ్చని పేర్కొంది.

News October 12, 2024

ఇవాళ పాలపిట్టను ఎందుకు చూడాలంటే?

image

దసరా రోజున పాలపిట్టను చూస్తే అదృష్టం, విజయం వరిస్తుందని నమ్మకం. రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూడటంతో విజయం సాధించాడని పురాణ గాథ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు పాలపిట్టను చూడటంతో కౌరవులను గెలిచారని మరోగాథ. ఈ నమ్మకంతో గ్రామాల్లో దసరా రోజున సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు, ఊరి చివరకు వెళ్తారు.