News March 21, 2024
రైలు దొంగలు.. దేనినీ వదలరు

రైళ్లలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చోరీలకు పాల్పడుతూ భారత రైల్వేకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఏడాది వ్యవధిలో ₹2.5cr విలువ చేసే వస్తువులను చోరీ చేసినట్లు సమాచారం. 2లక్షల తువాళ్లు, 55వేల పిల్లో కవర్లు, 81వేల బెడ్షీట్లు, 7వేల దుప్పట్లు, వెయ్యి ట్యాప్లు, 200 టాయిలెట్ మగ్గులు, 300 ఫ్లష్ పైపులను చోరీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో రోజూ సుమారు 13,169 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి.
Similar News
News December 26, 2025
మామిడి చెట్లపై చెదను ఎలా నివారించాలి?

మామిడిలో NOV-డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్ని పూతగా పూయాలి.
News December 26, 2025
రైల్వే ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమల్లోకి

రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల <<18630596>>ధరలు<<>> నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ క్లాస్లో 215KM లోపు జర్నీపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆపై ప్రయాణం చేసేవారికి ప్రతి KMకు పైసా చొప్పున, మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ AC, AC తరగతుల్లో ప్రతి KMకు 2 పైసల చొప్పున పెంచారు. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో మార్పులు లేవు. ఈ మేరకు రైల్వే నోటిఫై చేసింది. ఈ ఏడాదిలో ఛార్జీలను 2 సార్లు పెంచింది.
News December 26, 2025
ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.


