News May 25, 2024

5ని.ల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

image

ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ సీట్లను ఇతర ప్రయాణికులు బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. రైలు బయల్దేరడానికి 5ని.షాల ముందు కూడా వాటిని రిజర్వ్ చేసుకోవచ్చు. IRCTC యాప్‌లో ట్రైన్ సింబల్‌‌ క్లిక్ చేస్తే ఛార్ట్ వేకెన్సీ‌లో ఖాళీల వివరాలుంటాయి. irctc వెబ్‌సైట్లోనూ online-chartsలో ట్రైన్, జర్నీ వివరాలు ఎంటర్ చేసి GET TRAIN CHART క్లిక్ చేయాలి. ఖాళీలుంటే బుక్ చేసుకోవచ్చు.

Similar News

News March 16, 2026

LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌లు: CBN

image

AP: గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు పోకుండా చూడాలని CBN కంపెనీల అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, గుడులకు గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలన్నారు. ప్రజల్లో ఆందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. LPG బదులు పైప్డ్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ వినియోగించేలా చేయాలన్నారు. LPG వాడకం తగ్గించేలా హోటళ్లతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో 17,209MT స్టాక్ ఉందని CMకు అధికారులు తెలిపారు.

News March 16, 2026

మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ కన్నుమూత

image

TG: ఉమ్మడి ఆదిలాబాద్(D) ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్(71) అనారోగ్యంతో మృతిచెందారు. దండేపల్లి(M) లింగాపూర్‌లోని తన స్వగృహంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా(1985) గెలుపొందిన ఆయన, ఆ తర్వాత TDP(1994), BRS(2004) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

News March 16, 2026

గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు

image

LPGకి హైడిమాండ్ నెలకొన్న వేళ PNG కనెక్షన్లకు ప్రజలను ఆకర్షించేందుకు గ్యాస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. MAR 31లోగా రిజిస్టరయ్యే డొమెస్టిక్ యూజర్లకు GAIL, ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థలు ₹500 విలువైన ఫ్రీ గ్యాస్ అందించనున్నాయి. మహానగర్ గ్యాస్.. కమర్షియల్‌ కనెక్షన్ల సెక్యూరిటీ డిపాజిట్ (₹1L-5L), డొమెస్టిక్‌‌ రిజిస్ట్రేషన్ ఫీ (₹500)పై మినహాయింపు ఇచ్చింది. BPCL కూడా కమర్షియల్‌పై జీరో డిపాజిట్ ప్రకటించింది.