News December 24, 2024
ఈ నెల 27 నుంచి SMCలకు శిక్షణ
AP: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(SMC)లకు డిసెంబర్ 27 నుంచి నాన్ రెసిడెన్షియల్ విధానంలో రోజూ శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 27 నుంచి 30 వరకు జిల్లా స్థాయిలో, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలో, జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విజయవంతం చేసేలా RJDలు చొరవ చూపాలని విద్యాశాఖ పేర్కొంది.
Similar News
News January 20, 2025
విశ్వవిజేతలకు మోదీ అభినందనలు
ఖో ఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాలతో గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆటగాళ్ల పట్టుదల, నిబద్దత అభినందనీయమని కొనియాడారు. యువతకు ఖో ఖోలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
News January 20, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 20, 2025
భారత్‌పై WEF చీఫ్ ప్రశంసల వర్షం
వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్(WEF) చీఫ్ బోర్గే బ్రెండే భారత్ వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 20% ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, విద్యా, పరిశోధనల్లో సంస్కరణల సాయంతో భారత వృద్ధి రేటు 7-8% చేరుకుంటుందని అంచనా వేశారు. భారత్‌లో లక్షకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని చెప్పారు. ఇవే భవిష్యత్తు వృద్ధికి ఆధారమని పేర్కొన్నారు.