News October 8, 2024

హరియాణాలో మారిన ట్రెండ్: మ్యాజిక్ ఫిగర్ వైపు BJP

image

హరియాణాలో బీజేపీ లీడ్ క్రమంగా పెరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో 26గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 45కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు ఒక స్థానమే దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి ఆధిక్యం 50 నుంచి 41కి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితేనే ఎవరు విజయం వైపు పయనిస్తున్నారో స్పష్టత వస్తుంది. ఇక ఇతరులు 3, INLD ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. JJPకి ఎక్కడా పోటీలో ఉన్నట్టే తెలియడం లేదు.

Similar News

News January 24, 2026

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News January 24, 2026

800 ఉరిశిక్షలు ఆపానని ట్రంప్ ప్రకటన.. అంతా ఉత్తదేనన్న ఇరాన్

image

తన జోక్యంతో 800కు పైగా నిరసనకారుల <<18930505>>మరణశిక్షలు<<>> ఆగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. అందులో నిజం లేదని స్పష్టంచేసింది. ‘ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఆ స్థాయిలో మరణశిక్షలు లేవు. న్యాయవ్యవస్థ కూడా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు’ అని ఇరాన్ టాప్ ప్రాసిక్యూటర్ మహ్మద్ మొవహేదీ చెప్పారు. కాగా ఇరాన్ వైపు యుద్ధ నౌకలు వెళ్తున్నాయని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.

News January 24, 2026

రాష్ట్రంలో 859 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులై, వయసు 18 -46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, టైప్ టెస్ట్, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, EWS, PwBDలకు రూ.400. సైట్: tshc.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.