News October 8, 2024

హరియాణాలో మారిన ట్రెండ్: మ్యాజిక్ ఫిగర్ వైపు BJP

image

హరియాణాలో బీజేపీ లీడ్ క్రమంగా పెరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో 26గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 45కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు ఒక స్థానమే దూరంలో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమి ఆధిక్యం 50 నుంచి 41కి తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితేనే ఎవరు విజయం వైపు పయనిస్తున్నారో స్పష్టత వస్తుంది. ఇక ఇతరులు 3, INLD ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. JJPకి ఎక్కడా పోటీలో ఉన్నట్టే తెలియడం లేదు.

Similar News

News February 18, 2026

ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

image

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

News February 18, 2026

ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

image

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.

News February 18, 2026

NBCC 59పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (<>NBCC<<>>)లిమిటెడ్ 59 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE, BTech, B.Arch, PG, డిప్లొమా(మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం), MBA, MSW, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 6 – ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, CBT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000. SC, ST, PwBDలకు ఫీజు లేదు. సైట్: nbccindia.in/