News January 24, 2025

ట్రెండింగులో #AttackOnBSF

image

రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News February 14, 2025

GBS బాధితులకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

image

APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.

News February 14, 2025

సహకార సంఘాల కాలపరిమితి పెంపు

image

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 DCCB ఛైర్మన్ల పదవీకాలన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటితో గడువు ముగుస్తున్నా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పాలకవర్గాల గడువును ప్రభుత్వం పొడిగించింది.

News February 14, 2025

వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫోన్ సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టులో కోరారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోమవారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.

error: Content is protected !!