News February 20, 2025

ట్రెండింగ్‌లో #GetOutModi

image

జాతీయ విద్యా విధానం తమిళనాడు రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. హిందీకి తాము వ్యతిరేకమని, తమపై ఆ భాషను రుద్దలేరని స్థానిక పార్టీలు అంటున్నాయి. హిందీని రాజకీయాలతో ముడిపెట్టొద్దని, NEP అమలు చేయాల్సిందేనని TN BJP ప్రెసిడెంట్ అన్నామలై అన్నారు. ఈ నేపథ్యంలో తమిళులు #GetOutModi, #GoBackModi హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

image

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.

News November 21, 2025

స్వీట్ కార్న్.. కోత సమయాన్ని ఎలా గుర్తించాలి?

image

తీపి మొక్కజొన్న కండెలపై కొంచెం ఎండిన పీచు, కండెపై బిగుతుగా ఉన్న ఆకు పచ్చని పొట్టు, బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గింజపై గిల్లితే పాలు కారతాయి. ఈ సమయంలో కండెలను కోయడం మంచిది. కోత ఆలస్యమైతే గింజలోని తీపిదనం తగ్గుతుంది. తీపి మొక్కజొన్నను దఫదఫాలుగా విత్తుకుంటే పంట ఒకేసారి కోతకు వచ్చి వృథా కాకుండా పలు దఫాలుగా మార్కెట్ చేసుకోవచ్చు.

News November 21, 2025

భారీగా తగ్గిన వెండి రేటు.. పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ సిల్వర్ రేటు రూ.12,000 పతనమై రూ.1,61,000కు చేరింది. అటు బంగారం ధరల్లోనూ స్వల్ప మార్పులున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,24,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 ఎగబాకి రూ.1,14,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.