News February 20, 2025
ట్రెండింగ్‌లో #GetOutModi

జాతీయ విద్యా విధానం తమిళనాడు రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. హిందీకి తాము వ్యతిరేకమని, తమపై ఆ భాషను రుద్దలేరని స్థానిక పార్టీలు అంటున్నాయి. హిందీని రాజకీయాలతో ముడిపెట్టొద్దని, NEP అమలు చేయాల్సిందేనని TN BJP ప్రెసిడెంట్ అన్నామలై అన్నారు. ఈ నేపథ్యంలో తమిళులు #GetOutModi, #GoBackModi హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
Similar News
News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
News March 23, 2025
ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.
News March 23, 2025
IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్‌లో SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్‌గానూ రికార్డ్ సృష్టించింది.