News July 19, 2024
ట్రెండింగ్: #uninstallphonepe

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని PhonePe CEO సమీర్ నిగమ్ వ్యతిరేకించారు. తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా బహుళ రాష్ట్రాల్లో నివసించిన వారికి ఈ బిల్లు అన్యాయం చేస్తుందని వాదించడంపై కన్నడిగులు మండిపడుతున్నారు. కన్నడిగులకు సమీర్ క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఫోన్పేని డిలీట్ చేయాలని #uninstallphonepeతో ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో వాంకిడి, జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ యూలోని 114 జీపీలకు, 2వ విడతలో బెజ్జూర్, చింతలమనే పల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట, సిర్పూర్ టీలోని 113 జీపీలకు, 3వ దశలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన,
తిర్యాణి మండలాల్లోని 108 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
News November 26, 2025
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ట్రాఫిక్ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. యువత పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
News November 26, 2025
కామారెడ్డి: సీతాయిపల్లి అటవీ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు

గాంధారి మండలం సీతాయపల్లి కంచ్మల్ అటవీ ప్రాంతం శివారులో ఇటీవల చిరుత సంచరించడంపై స్థానికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని అటవీ అధికారులు తెలిపారు. భవానిపేట నుంచి బాన్సువాడకు వెళ్లే రహదారి అటవీ ప్రాంతం ఉన్నందున ఈ రహదారి గుండా ప్రయాణించేవారు సాయంత్రం 5 గంటల తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


