News July 19, 2024

ట్రెండింగ్: #uninstallphonepe

image

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని PhonePe CEO సమీర్ నిగమ్ వ్యతిరేకించారు. తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా బహుళ రాష్ట్రాల్లో నివసించిన వారికి ఈ బిల్లు అన్యాయం చేస్తుందని వాదించడంపై కన్నడిగులు మండిపడుతున్నారు. కన్నడిగులకు సమీర్ క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఫోన్‌పేని డిలీట్ చేయాలని #uninstallphonepeతో ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Similar News

News July 11, 2025

HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

image

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.

News July 11, 2025

భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.

News July 11, 2025

యాపిల్ ఉద్యోగికి ₹1,714 కోట్లు చెల్లించిన మెటా!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా నిలిచేందుకు మెటా CEO మార్క్ ఉద్యోగులకు కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా యాపిల్ కంపెనీలోని అగ్రశ్రేణి AI నిపుణుడైన రూమింగ్ పాంగ్‌ను మెటా నియమించుకుంది. తమ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ గ్రూపులో పాంగ్‌ను చేర్చినట్లు తెలిపింది. దీనికోసం ఆయనకు మెటా ఏడాదికి $200M( ₹1,714కోట్లు) చెల్లించనుండడం టెక్ యుగంలో చర్చనీయాంశమైంది. ఈ ప్యాకేజీ ఇచ్చేందుకు యాపిల్ ఇష్టపడలేదు.