News February 3, 2025

గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి

image

గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 3, 2025

RG Kar మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

image

వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనతో వార్తల్లో నిలిచిన కోల్‌కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన జరిగింది. అక్కడి ESI క్వార్టర్స్‌లో MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తలుపు తీయకపోవడంతో తల్లి డోర్‌ను తోసుకుని లోపలికి వెళ్లగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రూమ్‌లో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

News February 3, 2025

త్వరలోనే గజ్వేల్‌లో కేసీఆర్ భారీ సభ!

image

TG: ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.

News February 3, 2025

నేడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు

image

AP: మూడు మున్సిపాలిటీలకు ఛైర్మన్‌లు, 4 పురపాలికల్లో వైస్ ఛైర్మన్‌లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇందుకోసం ఉ.11 గంటలకు కౌన్సిళ్లకు సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ, నూజివీడు, తుని, పిడుగురాళ్ల, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి.