News February 3, 2025
గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి

గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
News February 10, 2025
వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.
News February 10, 2025
26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.