News August 15, 2024
ఆ 13 గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ రెపరెపలు

మావోయిస్టుల కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ఊళ్లలో జాతీయ జెండాను ఎప్పుడూ ఎగురవేయలేదు. ఎట్టకేలకు 13 ఊళ్లకు ఇప్పుడు స్వాతంత్ర్యం లభించింది. గడచిన 7 నెలలుగా ఆ గ్రామాల్లో తమ కృషి సత్ఫలితాలను ఇచ్చిందని పోలీసులు తెలిపారు. నెర్లిఘాట్, పనిదోబిర్, గుండం, పుట్కెల్, చుత్వాహీ, కస్తూర్మేట, మాస్పూర్, ఇరాక్‌భట్టి, మొహందీ, టెకల్గూడెం, పువర్తి, లఖపాల్, పులాన్పాడ్ గ్రామాల్లో జెండా ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా (SM) వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. 2026లో ఇది అమల్లోకి రానుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పిల్లలు SM వాడితే పేరెంట్స్‌కు ఫైన్ వేయాలని భావిస్తోంది. కాగా టీనేజర్లకు DEC నుంచి SMను నిషేధిస్తామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియాలోనూ ఇలాంటి రూల్ అమలు చేయాలంటారా?
News November 25, 2025
‘అఖండ-2’ మూవీకి అరుదైన ఘనత!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాను అవధి భాషలోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యే తొలి టాలీవుడ్ సినిమాగా నిలవబోతోందని పేర్కొన్నాయి. ఈ ఇండో-ఆర్యన్ భాషను UP, MPలోని పలు ప్రాంతాల్లో మాట్లాడుతారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కానుండగా వారణాసిలో CM యోగి గెస్ట్‌గా ఓ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News November 25, 2025
లక్ష్మణుడి అగ్నిపరీక్ష గురించి మీకు తెలుసా?

ఓసారి లక్ష్మణుడు తనను కోరి వచ్చిన అప్సరసను తిరస్కరిస్తాడు. ఆగ్రహించిన ఆ అప్సరస తన నగలను మంచంపై వదిలి వెళ్తుంది. ఆ నగలను చూసిన సీతాదేవి లక్ష్మణుడి పవిత్రతను ప్రశ్నిస్తుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి లక్ష్మణుడు అగ్నిగుండంలో నడుస్తాడు. ఇలా లక్ష్మణుడు తన నిజాయితీని, పవిత్రతను రుజువు చేసుకుంటాడు. అయితే ఈ కథ జానపద రామాయణంలో నుంచి పుట్టిందని చెబుతారు.


