News August 15, 2024
ఆ 13 గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ రెపరెపలు
మావోయిస్టుల కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ఊళ్లలో జాతీయ జెండాను ఎప్పుడూ ఎగురవేయలేదు. ఎట్టకేలకు 13 ఊళ్లకు ఇప్పుడు స్వాతంత్ర్యం లభించింది. గడచిన 7 నెలలుగా ఆ గ్రామాల్లో తమ కృషి సత్ఫలితాలను ఇచ్చిందని పోలీసులు తెలిపారు. నెర్లిఘాట్, పనిదోబిర్, గుండం, పుట్కెల్, చుత్వాహీ, కస్తూర్‌మేట, మాస్పూర్, ఇరాక్‌భట్టి, మొహందీ, టెకల్‌గూడెం, పువర్తి, లఖపాల్, పులాన్‌పాడ్ గ్రామాల్లో జెండా ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 20, 2024
పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
News September 20, 2024
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా వందలాది రాకెట్లతో విరుచుకుపడింది. దాదాపు 140 రాకెట్ లాంఛర్లతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ విషయాన్ని ఆ దేశం కూడా ధ్రువీకరించింది. కాగా ఇప్పటివరకు హమాస్ అంతమే లక్ష్యంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను కూడా టార్గెట్ చేసింది. దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
News September 20, 2024
కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్‌రావు
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.