News January 25, 2025
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 OCTలో గవర్నర్‌గా నియమితులయ్యారు.
Similar News
News February 13, 2025
కుంభమేళాలో చాయ్‌వాలా ఆదాయం తెలిస్తే షాక్!

కోట్లమంది రాకతో మహా కుంభమేళా వద్ద తిండి పదార్థాలు, టీలు, కాఫీలు, వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. అక్కడ టీ, కాఫీ అమ్ముతూ ఓ చాయ్‌వాలా ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతడి సంపాదన నిత్యం రూ.7000. అందులో రూ.2000 ఖర్చులు పోను రూ.5000 మిగులుతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. అంటే కుంభమేళా జరిగే నెలరోజుల్లో అతడి ఆదాయం రూ.1.50లక్షలకు పైనేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News February 13, 2025
లోక్‌సభ ముందుకు కొత్త IT బిల్లు

లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్‌సభను వాయిదా వేశారు.
News February 13, 2025
వైసీపీని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర: జూపూడి

AP: కూటమి ప్రభుత్వం చట్టాలు తెలియకుండా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దుయ్యబట్టారు. వైసీపీ కేడర్‌ను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందని అన్నారు. గన్నవరం దాడి విషయంలో 94 మందిపై కేసులు పెట్టారన్నారు. కోర్టులో కేసులు నడుస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సత్యవర్ధన్ నిజం చెబితే పోలీసుల చేత వేధించి కేసులు పెట్టించారని విమర్శించారు.