News July 11, 2024
‘భారతీయుడు-2’ టికెట్ ధరలపై ట్రోల్స్

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘ఇండియన్-2’. తెలుగులో ‘భారతీయుడు-2’గా వస్తోంది. ఈ సినిమా టికెట్ల ధరలను TGలో పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తమిళనాడులో ఉన్న రేట్లతో పోల్చితే తెలంగాణలో కొన్ని చోట్ల దాదాపు రెట్టింపు ధరలు ఉన్నాయని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. అన్ని సినిమాలకు ఇలాగే అయితే రిలీజైన వెంటనే చూడటం కష్టమేనని మూవీ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News February 9, 2025
మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు

మహారాష్ట్రలో తాజాగా మరో 3 <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 183కు చేరింది. 6 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఇటీవల ముంబైలోనూ GBS తొలి కేసు నమోదైంది. 64 ఏళ్ల వృద్ధురాలికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అంధేరి తూర్పు ప్రాంతంలో నివసించే ఆ మహిళకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 9, 2025
బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.