News August 22, 2025

నాగవంశీపై ట్రోల్స్.. ఆర్జీవీ రియాక్షన్ ఇదే

image

ప్రముఖ నిర్మాత నాగవంశీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ‘నాగవంశీ ఓ దయగల ప్రొడ్యూసర్. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కిందకు లాగలేవు. పది రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’ అంటూ పేర్కొన్నారు. కాగా ‘కింగ్డమ్’, ‘వార్2’ సినిమాల వల్ల నాగవంశీకి భారీ నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్‌కు దిగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News August 22, 2025

స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌కు భారత్?

image

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ బిల్లుతో టీమ్ ఇండియాకు మెయిన్ స్పాన్సర్‌గా ఉన్న ‘డ్రీమ్ 11’పై <<17477461>>నిషేధం<<>> అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఇక ఆ కంపెనీతో కాంట్రాక్టు కొనసాగించే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 9న ఆసియా కప్ ప్రారంభం కానుండగా, ఆలోగా స్పాన్సర్ దొరక్కపోతే మెయిన్ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు టోర్నీలో పాల్గొంటుందని తెలిపాయి.

News August 22, 2025

ఇవాళ స్కూళ్లు, కాలేజీలూ బందేనా?

image

మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ <<17479279>>బంద్‌కు<<>> ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు, కాలేజీలపై ప్రభావం చూపే అవకాశం లేదు. నేడు స్కూళ్లకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు రాలేదని తెలుస్తోంది. మరి మీకేమైనా హాలిడే అని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News August 22, 2025

నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

image

TG: వైద్యారోగ్య శాఖలో 1,623 స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో వైద్యుల భర్తీ ప్రక్రియలో ఇదే అతి పెద్ద నోటిఫికేషన్‌గా మారనుంది. ఇటీవల వైద్యారోగ్య శాఖలో 8 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం తెలిసిందే.