News July 25, 2024
కోటీశ్వరుల కష్టాలు.. రూ.10,800 కోట్ల లాస్
చైనా సంపన్నుడు ఝాంగ్ షాన్‌షాన్‌కు పెద్దచిక్కే వచ్చిపడింది. 2024లో ఆయన $13 బిలియన్ల (రూ.10,800 కోట్ల) సంపద నష్టపోయారు. అయినా $49.7 బిలియన్లతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల సూచీలో 23వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన కంపెనీ ‘నాంగ్‌ఫూ స్ప్రింగ్’ బాటిళ్లలో మంచినీళ్లు అమ్ముతుంది. ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ పెరగడం, మార్కెటింగ్ వ్యూహాల్లో వైఫల్యం వల్ల షేర్లు క్రాష్ అవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి 20% పతనమయ్యాయి.
Similar News
News December 10, 2024
నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?
AP: రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.
News December 10, 2024
BREAKING: మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎం, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
News December 10, 2024
MBUలో ఆర్థిక అవకతవకలు: మనోజ్
TG: తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని మనోజ్ అన్నారు. ‘కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబం దూరంగా ఉంటోంది. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులోని బాధితులకు నేను అండగా ఉన్నాను. అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని మనోజ్ అన్నారు. మనోజ్ రాసిన లెటర్ pdf కోసం ఇక్కడ <