News October 17, 2024
ట్రూడో స్టేట్‌మెంట్ భారత్‌కు విక్టరీ: కెనడా జర్నలిస్ట్
ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ నిజ్జర్ హత్యకేసులో ఆధారాల్లేవన్న జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు భారత్‌కు ఘన విజయమని కెనడా జర్నలిస్టు డేనియెల్ బార్డ్‌మన్ అన్నారు. ‘ఎవిడెన్స్ లేదు కాబట్టి జియో పొలిటికల్‌గా ఇది భారత్‌కు విక్టరీ. కానీ కెనడాకు వచ్చిందేంటి? హర్దీప్ టెర్రరిస్టా లేక కమ్యూనిస్టా అనే జవాబివ్వని ప్రశ్నపైనే దౌత్యవివాదం నెలకొంది. దీనిపై కదలికే లేదు. అసలేం చేస్తున్నాడో ట్రూడోకే తెలియడం లేదు’ అన్నారు.
Similar News
News November 5, 2024
IPL మెగా వేలం ఎక్కడంటే?
ఐపీఎల్ మెగావేలం ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాయి. ఈ మెగా వేలం కోసం 1,574 ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 320 మంది క్యాప్‌డ్, 1,224 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉన్నారు.
News November 5, 2024
సెల్యూట్ తల్లి.. భర్త మరణంతో కుటుంబానికి అండగా!
కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆకస్మికంగా మరణించడంతో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ పర్సన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అత్తామామ, పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఆమె రేయింబవళ్లు శ్రమిస్తోంది. సుప్రీతి ఎందరికో స్ఫూర్తి అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News November 5, 2024
జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు: సీఎం
AP: పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ముఖ్యమని తెలిపారు. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.