News June 4, 2024

నిజమే గెలిచింది: భువనేశ్వరి

image

AP: విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అభినందనలు చెప్పారు. ‘నా సంకల్పం.. “నిజం గెలవాలి” అన్న నా ఆకాంక్ష ఫలించింది. అంతిమంగా నిజమే గెలిచింది. ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News November 10, 2024

పరారీలో నటి కస్తూరి?

image

తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తున్నట్లు సమాచారం. 300 ఏళ్ల క్రితం అంతఃపుర రాణులకు సేవలు చేసేందుకు తెలుగువారు TN వచ్చారని, ఇప్పుడు వారు కూడా తమిళులమని చెప్పుకుంటున్నారని ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

News November 10, 2024

UK PM దీపావళి వేడుకల్లో మద్యం, మాంసం?

image

UK PM కీర్ స్టార్మర్ ఆతిథ్యమిచ్చిన దీపావళి వేడుకల్లో మద్యం, మాంసం వడ్డించడంతో బ్రిటిష్ హిందూస్ షాకయ్యారని తెలిసింది. ‘14 ఏళ్లుగా ప్రధాని నివాసంలో దీపావళి వేడుకలు మద్యం, మాంసం లేకుండానే జరుగుతున్నాయి. ముందే మమ్మల్ని సంప్రదిస్తే బాగుండేది. PM సలహాదారులు మరీ ఇంత నిర్లక్ష్యం, అలసత్వంతో ఉండటం దారుణం’ అని హిందువులు విమర్శిస్తున్నారు. గతేడాది రిషి సునాక్ వేడుకలు నిర్వహించిన తీరును గుర్తుచేసుకుంటున్నారు.

News November 10, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా.. FEB 23న పరీక్ష?

image

AP: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జనవరి 5న <<14491669>>జరగాల్సి<<>> ఉండగా అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతోపాటు మెయిన్స్‌కు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారులు కొత్త తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నారు.