News September 28, 2024

ట్రంప్ క్యాంపెయిన్ హ్యాక్: ఆ దేశస్థులపై కేసు

image

డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్‌పై సైబర్ గూఢచర్యం కేసులో ముగ్గురు ఇరానియన్లపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం క్రిమినల్ ఛార్జెస్ రిజిస్టర్ చేశారు. మరికొందరు హ్యాకర్లతో కలిసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తరఫున వీరు ఏడాదిగా కుట్ర చేస్తున్నారని US అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చెప్పారు. ట్రంప్ క్యాంపెయిన్ కీలక డాక్యుమెంట్లు దొంగిలించి జర్నలిస్టులు, జో బైడెన్ సంబంధీకులకు పంపారని తెలిపారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచి పోస్టులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని కమిషనర్ పేర్కొన్నారు.

News December 4, 2025

అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా?

image

వివాదాల కారణంగానే ‘అఖండ-2’ ప్రీమియర్లు <<18466572>>రద్దైనట్లు<<>> తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ సంస్థ రూ.28Cr చెల్లించాల్సిన వివాదం నేపథ్యంలో సినిమాను <<18465729>>ఆపాలని<<>> మద్రాసు HC ఆదేశించింది. అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కారణాలతోనే ప్రీమియర్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్లే ఆగిపోయినట్లు 14 రీల్స్ చెబుతోంది.

News December 4, 2025

మార్స్‌పై టైమ్ 477 మైక్రోసెకండ్ల ఫాస్ట్.. ఎందుకంటే?

image

మైక్రోసెకండ్ అంటే సెకనులో మిలియన్ వంతు. మనకు ఇది లెక్కలోకి రాని వ్యవధి. కానీ సోలార్ సిస్టమ్‌లో కచ్చితమైన నావిగేషన్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ప్లాన్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీలకు ఇది చాలా ముఖ్యం. భూమితో పోల్చితే అంగారకుడిపై గడియారం 477 మైక్రోసెకండ్లు వేగంగా వెళ్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీ ప్రకారం బలహీనమైన గురుత్వాకర్షణ, ఆర్బిటల్ ఫ్యాక్టర్స్ దీనికి కారణమన్నారు.