News September 28, 2024

ట్రంప్ క్యాంపెయిన్ హ్యాక్: ఆ దేశస్థులపై కేసు

image

డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్‌పై సైబర్ గూఢచర్యం కేసులో ముగ్గురు ఇరానియన్లపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం క్రిమినల్ ఛార్జెస్ రిజిస్టర్ చేశారు. మరికొందరు హ్యాకర్లతో కలిసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తరఫున వీరు ఏడాదిగా కుట్ర చేస్తున్నారని US అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చెప్పారు. ట్రంప్ క్యాంపెయిన్ కీలక డాక్యుమెంట్లు దొంగిలించి జర్నలిస్టులు, జో బైడెన్ సంబంధీకులకు పంపారని తెలిపారు.

Similar News

News October 10, 2024

సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..

image

భారత్‌ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

News October 10, 2024

ఈనెల 13 నుంచి రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి పర్యటన భారత్-ఆఫ్రికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించింది. పర్యటనలో భాగంగా ముర్ము ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలవనున్నారు.

News October 10, 2024

‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

AP: అంగ వైకల్య నిర్ధారణ పరీక్షలకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. మీసేవ, గ్రామ-వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.