News January 27, 2025

మాట విన్లేదు.. ప్రతీకారంతో టారిఫ్స్ పెంచేసిన ట్రంప్

image

కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లిన 2 విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారంగా 25% టారిఫ్స్ పెంచేశారు. ఆ దేశ పౌరులపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. వారి మద్దతుదారులు సహా అధికారుల వీసాలను రద్దు చేశారు. ‘కొలంబియా ప్రెసిడెంట్‌ గుస్తావో పెట్రోకు మంచిపేరు లేదు. విమానాలను అడ్డుకొని US భద్రతను ఆయన సందిగ్ధంలో పడేశారు’ అని అన్నారు.

Similar News

News January 20, 2026

ఆయుష్షును పెంచే మహోద్దేశ సూత్రాలు

image

మంచి అలవాట్లు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
ఆభరణాలు ధరిస్తే ఆయుష్షు పెరుగుతుంది.
చక్కని దుస్తులు ధరిస్తే ముఖంలో తేజోమయం అవుతుంది.
ప్రసన్నంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
నవ్వుతూ ఉంటే సంపద కలుగుతుంది.
పట్టుదలతో కృషి చేస్తే విజయం సొంతమవుతుంది.
ఇతరులకు సహాయపడితే క్షేమం కలుగుతుంది.
తృప్తిగా ఉంటే యవ్వనంగా ఉంటారు.
మధురంగా మాట్లాడితే అదృష్టం వరిస్తుంది.
మితంగా భుజిస్తే చక్కని రూపం సొంతమవుతుంది.

News January 20, 2026

ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలంటే?

image

గర్భం ధరించిన విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే బిడ్డకు అంత మంచిదంటున్నారు నిపుణులు. చాలామంది నెలసరి మిస్సవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటారు. అప్పుడు గర్భం ధరించినా కొన్నిసార్లు నెగెటివ్‌ రావచ్చు. నెలసరి మిస్సయిన వారానికి టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్‌ అయినా ఒక్కోసారి కొంతమందిలో నెగెటివ్‌ వస్తుంటుంది. మీకు లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 20, 2026

IIT రూర్కేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

<>IIT <<>>రూర్కేలో 9 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE, BTech, ME, MTech, MCA, PhD(CS), PG, MD/MS, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుకు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన వారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1000, OBC/EWSలకు రూ.800, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.500. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్:iitr.ac.in/