News January 27, 2025
మాట విన్లేదు.. ప్రతీకారంతో టారిఫ్స్ పెంచేసిన ట్రంప్

కొలంబియాపై డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపించారు. అక్రమ వలసదారులను తీసుకెళ్లిన 2 విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకారంగా 25% టారిఫ్స్ పెంచేశారు. ఆ దేశ పౌరులపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. వారి మద్దతుదారులు సహా అధికారుల వీసాలను రద్దు చేశారు. ‘కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోకు మంచిపేరు లేదు. విమానాలను అడ్డుకొని US భద్రతను ఆయన సందిగ్ధంలో పడేశారు’ అని అన్నారు.
Similar News
News February 10, 2025
కామెడీ షోలో బూతులు.. పోలీసులకు ఫిర్యాదు

కామెడీ షోలో అసభ్యంగా బూతులు మాట్లాడిన వారిపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజా, కమెడియన్ సమయ్ రైనా అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. బూతులే కామెడీ అనుకుంటున్నారా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News February 10, 2025
విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
రాజ్ ఠాక్రేతో ఫడణవీస్ భేటీ

MNS చీఫ్ రాజ్‌ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.