News March 16, 2025

మస్క్ కుమారునికి సహాయం చేసిన ట్రంప్

image

మస్క్ కుమారుడిని ట్రంప్ హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడాలోని తన ఇంటికి బయలుదేరగా ఆయనతో పాటు మస్క్ కుమారుడు వెళ్లాడు. ఆ ఛాపర్‌లోనికి ఎక్కడానికి పిల్లాడు ఇబ్బంది పడగా ట్రంప్ అతనికి సహాయం చేశారు. ఈ చిత్రాన్ని మస్క్ రీపోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా టెస్లా అధినేత తన కుమారున్ని USA అధికార కార్యక్రమాలకు వెంట తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

News February 15, 2026

నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

image

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.