News February 16, 2025

న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

image

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

Similar News

News April 17, 2026

వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.

News April 17, 2026

భారత్‌కు సౌత్ కొరియా అధ్యక్షుడు

image

సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత్ పర్యటనకు రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 19వ తేదీ ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా లీ పర్యటన సాగనుంది. మరోవైపు పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలకాంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News April 17, 2026

అహాన్, అనీత్.. మరో సినిమాకు ‘సై’యారా

image

బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై <<17590211>>బాక్సాఫీస్‌ను<<>> షేక్ చేసిన సినిమా ‘సైయారా’. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ జంట మరో రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమైంది. సైయారా తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సూరి, ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి, 2027లో మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.