News November 7, 2024
131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
Similar News
News November 7, 2024
మధ్యాహ్నం జగన్ కీలక ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై నమోదవుతున్న కేసులపై స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా వారం రోజుల్లోనే 107 మందిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.
News November 7, 2024
ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు
AP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 1,732 మందికి లబ్ధి చేకూర్చనుంది. ఈ నెల 10లోగా అర్హులను ఎంపికచేయాలని అధికారులను ఆదేశించింది. నర్సరీ, విత్తనాల తయారీ, ఆటో కొనుగోలు, ఫొటో స్టూడియో, బ్యూటీ పార్లర్, చిన్న దుకాణాల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల రుణం ఇస్తారు. ఇందులో రూ.50వేల రాయితీ ఉంటుంది. వడ్డీ చెల్లింపుపై త్వరలో క్లారిటీ రానుంది.
News November 7, 2024
రికార్డు సృష్టిస్తోన్న ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా విడుదలకు ముందే చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా $500K ప్రీమియర్ ప్రీ-సేల్స్ జరిపినట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీ విడుదలకు ఇంకా 30 రోజులు ఉన్నప్పటికీ అప్పుడే ఆఫ్ మిలియన్ క్రాస్ చేసిందన్నారు. విడుదల తేదీ నాటికి రికార్డు ప్రీ కలెక్షన్లు సాధిస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.