News November 7, 2024

131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్

image

అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

Similar News

News December 11, 2024

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

image

TG: జల్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌పై దాడి కేసులో ఆయనను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి జరిగిందని మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 11, 2024

రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.