News April 14, 2025
ట్రంప్ హత్య కోసం తల్లిదండ్రులను చంపేశాడు!

US విస్కాన్సిన్‌లో కసాప్(17) అనే కుర్రాడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు డబ్బు కోసం కన్నతల్లి, సవతి తండ్రిని కాల్చి చంపినట్లు FBI వెల్లడించింది. FEB 11న హత్యలు చేయగా.. తాజాగా ఈ కుట్రకోణం వెలుగు చూసింది. మారణకాండ సృష్టించేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలు కొనే ప్రయత్నాలూ చేశాడట. రష్యాలోని ఓ వ్యక్తితో టచ్‌లో ఉన్నాడని.. అతని ఫోన్లో హిట్లర్ ఫొటోలు, జాతి విద్వేష భావజాలాన్ని గుర్తించినట్లు తెలిపింది.
Similar News
News April 23, 2025
సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.
News April 23, 2025
అద్భుతమైన క్యాచ్‌లు కాదు.. క్యాచ్ పడితే అద్భుతం!

IPL: ఫీల్డింగ్‌లో ఈ ఏడాది అన్ని జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. ఇప్పటి వరకు 40 మ్యాచులు జరగ్గా, అన్ని జట్లు కలిపి 111 క్యాచ్‌లు వదిలేశాయి. 247 మిస్‌ఫీల్డ్స్, 172 రనౌట్స్ మిస్ చేశాయి. 2020 నుంచి తొలి 40 మ్యాచ్‌లతో పోలిస్తే ఇదే చెత్త ప్రదర్శన. MI జట్టు ఒక్కటే 83.6% క్యాచింగ్ పర్సంటేజ్‌తో కాస్త మెరుగ్గా ఉంది. గతంలో అద్భుతమైన క్యాచ్‌లు చూసిన ఫ్యాన్స్ ప్రస్తుతం పట్టిన ప్రతి క్యాచ్‌నూ అద్భుతం అంటున్నారు.