News March 21, 2025
అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.
Similar News
News January 29, 2026
SC స్కాలర్‌షిప్‌లకు ఆదాయ పరిమితిని పెంచనున్న కేంద్రం

SC విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల మంజూరులో పేరెంట్స్ గరిష్ఠ ఆదాయ పరిమితిని ₹2.5 లక్షల నుంచి ₹4.5 లక్షలకు కేంద్రం పెంచనుంది. దీనిపై నోట్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్సులను బట్టి హాస్టలర్స్‌కు రూ.4,000-13,500, డేస్కాలర్స్‌కు రూ.2,000-7,500 వరకు స్కాలర్షిప్ అందిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ సూచనల తర్వాత క్యాబినెట్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీకి నోట్‌ను అందిస్తారు.
News January 29, 2026
మేడారం జాతర సిత్రాలు (Photo Gallery)

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. సమ్మక్క గద్దెపైకి రావడంతో భక్తుల కోలాహలం మరింత పెరిగింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు. మేడారం జనజాతర, విశేషాలను పైన ఫొటో గ్యాలరీలో చూడండి.
News January 29, 2026
పోలీసు సేవకు సలాం చెప్పాల్సిందే!

అందరూ కుటుంబంతో మేడారం జాతరకు వెళ్తే పోలీసులు మాత్రం మన కోసం కుటుంబాన్ని వదిలి పహారా కాస్తున్నారు. నేడు సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్క చిన్న ప్రమాదం, పొరపాటు కూడా జరగకుండా వారు అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణతో మహాజాతరను శాంతియుతంగా పూర్తి చేసుకుందాం. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుదాం.


