News February 10, 2025

ట్రంప్ మరోసారి కీలక ఆదేశాలు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త నాణేల తయారీని నిలిపివేయాలని ట్రెజరీ శాఖను ఆదేశించారు. కాయిన్‌లు నిరుపయోగమని అభిప్రాయపడ్డారు. నాణేల విలువ కన్నా తయారీకి ఖర్చు ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

రాత్రి 7.30కు పవర్ కట్ అంటూ సైబర్ మోసం

image

TG: సైబర్ నేరగాళ్లు కొత్త మోసంతో మాయ చేస్తున్నారు. ‘మీరు గత నెల కరెంట్ బిల్ చెల్లించలేదు. ఇవాళ రాత్రి 7.30కు పవర్ కట్ అవుతుంది’ అని పలువురు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ వర్గాలు స్పందించాయి. TGSPDCL ఎప్పుడూ ఇలాంటి మెసే‌జ్‌లు పంపదని, ఉద్యోగులెవరూ వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకోరని స్పష్టం చేశాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

News March 27, 2025

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ ఆందోళన

image

డీప్ ఫేక్‌పై నటి, ఎంపీ హేమామాలిని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. దీంతో పేరు, ప్రఖ్యాతుల కోసం పడిన కష్టమంతా దెబ్బతింటుందని చెప్పారు. అనేక మంది దీని బారిన పడ్డారని చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. రష్మిక, విద్యా బాలన్ వంటి నటులు డీప్ ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

పిఠాపురం నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు

image

AP: Dy.CM పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలోని మూలపేటలో రికార్డింగ్ డాన్సుల వీడియో SMలో వైరలవుతోంది. అమ్మవారి జాతర సందర్భంగా అర్ధరాత్రి అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. ఓ వైపు టెన్త్ పరీక్షలు జరుగుతుంటే ఇలాంటి డాన్సులు ఏర్పాటు చేయడం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. పవన్ స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా గైడ్‌లైన్స్ ప్రకారం ఆ <>వీడియో<<>>ను పబ్లిష్ చేయలేకపోతున్నాం.

error: Content is protected !!