News November 1, 2024
ట్రంప్ అసభ్యంగా తాకి ముద్దు పెట్టారు.. స్విస్ మోడల్ బీట్రైస్ కీల్
ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తనపై మరో మోడల్ ఆరోపణలు గుప్పించారు. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో డోనాల్డ్ ట్రంప్ తనను అనుచితంగా తాకి, పెదాలపై ముద్దు పెట్టారని స్విస్ మోడల్ బీట్రైస్ కీల్ ఆరోపించారు. దీంతో ట్రంప్‌పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల సంఖ్య 28కి చేరింది. ఇటీవల మోడల్ స్టాసీ విలియమ్స్ కూడా ట్రంప్‌పై ఈ తరహా ఆరోపణలు చేశారు. అయితే, ట్రంప్ బృందం ఈ ఆరోపణల్ని ఖండించింది.
Similar News
News November 13, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.
News November 13, 2024
విరాట్, రోహిత్ బ్రేక్ తీసుకోవాలి: బ్రెట్ లీ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.
News November 13, 2024
బుల్డోజర్ యాక్షన్: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు వార్నింగ్
బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలు, అధికారులు జడ్జిలుగా మారి వ్యక్తులను దోషులుగా నిర్ధారించకూడదని, వారి ఆస్తులను ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ నిజంగానే నేరనిరూపణ జరిగినా ఇళ్లను కూల్చకూడదని, అలా చేస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడతారని గుర్తుచేసింది.