News August 9, 2024
ప్రజాదరణలో వెనుకబడ్డ ట్రంప్: IPSOS పోల్
SEP 10న అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, కమల తమ ఛానల్‌లో డిబేట్‌లో పాల్గొంటారని ఏబీసీ నెట్‌వర్క్ ప్రకటించింది. గతంలో ట్రంప్ ఆ ఛానల్‌పై కేసు వేయడం గమనార్హం. మరోవైపు అధ్యక్ష బరిలోకి కమల ప్రవేశించాక ప్రజాదరణలో ట్రంప్ వెనుకబడ్డారు. IPSOS పోల్ ఫలితాల ప్రకారం కమలకు 42శాతం ఆదరణ ఉండగా, ట్రంప్‌నకు 37శాతమే ఉంది. ఈ నెల 2 నుంచి 7వ తేదీల మధ్యలో అమెరికావ్యాప్తంగా 2045మందిపై ఈ సర్వేను నిర్వహించారు.
Similar News
News September 21, 2024
ANR విలన్‌గా ఎందుకు చేయలేదో తెలుసా!
తన లోపాలను తెలుసుకోవడమే తన విజయానికి కారణమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, విలన్ పాత్రలు వేశారు. కానీ అక్కినేని ఒక్కసారీ విలనీ వైపు వెళ్లలేదు. పౌరాణికాల్ని పెద్దగా టచ్ చేయలేదు. తన రూపం, కంఠం అందుకు సరైనవి కావని ఆయన భావించడమే దానిక్కారణం. కానీ సాంఘిక సినిమాల్లో మాత్రం విశ్వరూపం చూపించారు. నేడు ఆ మహానటుడి శతజయంతి. సినిమా ఉన్నంతకాలం ఆయన మన మధ్య జీవించే ఉంటారు.
News September 21, 2024
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల
AP: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.
News September 21, 2024
BJP స్టిక్కర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుంది: కాంగ్రెస్ ధ్వజం
గురుగ్రామ్‌లో రాంగ్ రూట్‌లో వెళ్తున్న ఓ కారు వ్యక్తి మృతికి కారణమవ్వడంపై BJPని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఈ ఘటనలో బైకర్ మృతికి కారణమైన కారు డ్రైవర్‌కు ఒక్క రోజులోనే బెయిల్ మంజూరైంది. అతని కారుపై BJP స్టిక్కర్ ఉండడమే దీనికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ స్టికర్ అన్ని నేరాల నుంచి రక్షిస్తుందంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇది బీజేపీ జంగిల్ రూల్ అంటూ మండిపడింది.