News November 11, 2024
మనుమరాళ్లతో సందడిగా గడిపిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని నెలలుగా ప్రచారంలో బిజీగా గడిపిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం కుటుంబంతో చిల్ అవుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మనుమరాళ్లతో గోల్ఫ్ ఆడుతూ సందడిగా గడిపారు. ‘తాతయ్యతో సందడిగా గడిపాం’ అంటూ ట్రంప్ మనుమరాలు కాయ్ ట్విటర్‌లో ఫొటోను పంచుకున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అని క్యాప్షన్ ఉన్న క్యాప్‌ను ఆయన ధరించారు.
Similar News
News December 6, 2025
మంచిర్యాల: ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి: కలెక్టర్

ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి సేవలను పొందడం ప్రతి పౌరుడి హక్కు అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుతో కలిసి ఆయన గోడప్రతులను ఆవిష్కరించారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
News December 6, 2025
హిట్ మ్యాన్@ 20,000 రన్స్

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.
News December 6, 2025
నెలసరి లీవ్స్.. మన రాష్ట్రంలో అమలు చేస్తారా?

TG: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నెలసరి ప్రయోజన బిల్లు-2024(ప్రైవేట్)ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళలకు నెలసరి సమయంలో 4 రోజుల పెయిడ్ లీవ్స్‌తో పాటు బ్రేక్స్, పనిచేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, హక్కులు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిశా ప్రభుత్వాలు ఈ తరహా సెలవులు ఇస్తుండగా తెలంగాణలోనూ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.


