News February 10, 2025
ట్రంప్ టారిఫ్స్: రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠానికి ఢమాల్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు కుదేలవుతున్నాయి. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి 87.9563 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 87.9175 వద్ద ఓపెనైన రూపాయి ప్రస్తుతం 87.8240 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 108.266 వద్ద జోరు ప్రదర్శిస్తోంది. తాము దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News July 11, 2025
ఇటలీలో భారీగా ఉద్యోగాలు.. ఇండియన్స్‌కు భలే ఛాన్స్

2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇటలీలో 1,67,333 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఈ క్రమంలో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనా.
News July 11, 2025
మీ పిల్లలూ స్కూల్‌కి ఇలాగే వెళుతున్నారా?

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
News July 11, 2025
బిజినెస్ అప్‌డేట్స్

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు