News October 24, 2024

ట్రంప్ నన్ను అసభ్యంగా తాకారు: మాజీ మోడల్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను 1993లో అసభ్యంగా తాకారని మాజీ మోడల్ స్టేసీ విలియమ్స్ ఆరోపించారు. ‘న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ నాకు ట్రంప్‌ను తొలిసారి పరిచయం చేశారు. మొదట మామూలుగా పలకరించారు. తర్వాత అసభ్యంగా తాకడం ప్రారంభించారు. భయంతో నాకు నోట మాట రాలేదు. తర్వాత కుమిలిపోయాను’ అని వెల్లడించారు. ఆమె ఆరోపణల్ని ట్రంప్ వర్గం ఖండించింది.

Similar News

News February 3, 2026

సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకోవాలో తెలుసా?

image

వేసవిలోనే కాదు అన్ని సీజన్లలోనూ బయటకు వెళ్లేటప్పుడు చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్ వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. రెగ్యులర్ యూసేజ్‌కు SPF 30 PA(ప్రొటెక్షన్ గ్రేడ్) ఉన్న ప్రొడక్ట్‌ వాడుకోవచ్చు. ఎండలో తిరిగే వాళ్లు SPF 60/అంతకంటే ఎక్కువ ఉన్న లోషన్ ఉపయోగించాలి. ముఖం, మెడకు కలిపి 1/4 టీ స్పూన్ క్రీమ్ రాసుకోవాలి. లోషన్ వాడటమే కాదు, ఎంత పరిమాణం రాసుకుంటున్నామనేదీ ముఖ్యమే.

News February 3, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

image

<>ఆయుష్<<>> మంత్రిత్వశాఖ 7 కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ayush.gov.in

News February 3, 2026

వంటింటి చిట్కాలు

image

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే చాలు.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోయాలి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.