News May 2, 2024
ట్రంప్ vs బైడెన్.. నిపుణులు ఏమంటున్నారంటే?
డొనాల్డ్ ట్రంప్‌కు మహిళల మద్దతు పెరిగిందంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్. ‘జాతీయ పోలింగ్ సగటులో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ 1.5% ముందంజలో ఉన్నారు. లీగల్ ట్రబుల్స్ ప్రభావం అంతగా లేదు. నల్లజాతి విద్యావంతుల్లో ఆదరణ పెరిగింది’ అని తెలిపారు. చివరి 10 ఎన్నికల్లో 9సార్లు ఆయన జోస్యం ఫలించింది. 13 అంశాల ఆధారంగా గెలుపోటముల్ని అంచనా వేసే అలన్‌ను US అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా పేర్కొంటారు.
Similar News
News December 25, 2024
ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.
News December 25, 2024
ఆతిశీని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా, Sr నేతలను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో 5 రోజుల్లో వీరిపై ఫేక్ కేసులు బనాయిస్తారని BJPని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ ఈ మధ్యే ప్రకటించిన CM మహిళా సమ్మాన్ యోజన, సంజీవనీ యోజన వారిని ఇరుకున పెట్టాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ట్వీట్ చేశారు.
News December 25, 2024
‘బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్‌లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం. వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు <<14584831>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.