News July 14, 2024

దాడి తర్వాత భారీగా పెరిగిన ట్రంప్ విజయావకాశాలు

image

దాడి తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజయావకాశాలు భారీగా పెరిగినట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఆయన విజయానికి 70 శాతం ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. గాయపడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కంటే ట్రంప్ మరింత ముందంజలోకి వచ్చారు. కాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 13, 2024

PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ

image

రైల్వే నుంచి విమానాశ్ర‌యాల వ‌ర‌కు 7 కీల‌క రంగాల స‌మ్మిళిత వృద్ధి ల‌క్ష్యంగా ‘PM గ‌తిశ‌క్తి’ దేశ మౌలిక స‌దుపాయాల రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన పురోగ‌తికి తోడ్ప‌డిందన్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ‌ మెరుగుప‌డి ఆల‌స్యం తగ్గింద‌ని, త‌ద్వారా ఎంతో మంది కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నార‌ని మోదీ పేర్కొన్నారు.

News October 13, 2024

ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా

image

శ్రేయ‌స్ అనేక ప్రొడ‌క్ట్ డిజైన‌ర్ వ‌ర్క్‌ఫ్రం హోం కార‌ణంగా ఓ సంస్థ‌లో త‌క్కువ జీతానికి చేరారు. మొద‌టి రోజే 9 గంట‌లు కాకుండా 12-14 గంట‌లు ప‌నిచేయాల‌ని, అది కూడా కాంపెన్సేష‌న్ లేకుండా చేయాల‌ని మేనేజర్ ఆదేశించార‌ట‌. పైగా వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసిక‌ట్టుగా మాట్లాడ‌డంతో శ్రేయ‌స్ ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌లైంది.

News October 13, 2024

బాహుబలి-2ను దాటేసిన దేవర

image

తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.