News January 25, 2025
ట్రంప్ భయం: పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్నారు

అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా (F-1) ఉన్నవాళ్లు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పార్ట్ టైమ్ చేయాలి. కానీ మనోళ్లు గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లలో జాబ్స్ చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నవారిపై ట్రంప్ ఫోకస్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో దొరికితే వీసా క్యాన్సిల్ చేసి, స్వదేశాలకు పంపిస్తారని స్టూడెంట్ల భయం.
Similar News
News February 18, 2025
9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.