News November 10, 2024
ట్రంప్ గెలుపు: భయంతో కెనడాలో హై అలర్ట్
ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొన్న కెనడాకు మరో తలనొప్పి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్రమ వలసల భయం పట్టుకుంది. ట్రంప్ తొలి హయాంలో 2017-2021 మధ్య వేలమంది అమెరికా నుంచి కెనడాకు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్పై ఉక్కుపాదం మోపుతానని, అక్రమంగా ఎవరున్నా దేశం నుంచి పంపేస్తానని శపథం చేశారు. దీంతో వారంతా సమీపంలోని కెనడాకే వస్తారన్న అంచనాతో ఆ దేశం హైఅలర్ట్ ప్రకటించింది.
Similar News
News November 13, 2024
నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలి: KTR
TG: తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును BRSకు ఆపాదించే కుట్ర జరుగుతోంది. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News November 13, 2024
దేశంలో 3 లక్షల బీటెక్ సీట్లు మనవే!
బీటెక్ సీట్లలో AP, TG ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14.90 లక్షల సీట్లు ఉండగా ఇరు రాష్ట్రాల్లో కలిపి 3.10 లక్షల సీట్లు ఉండటం విశేషం. ఏపీలో 1.83 లక్షల సీట్లు, తెలంగాణలో 1.45 లక్షల సీట్లు ఉన్నాయి. 3.08 లక్షల సీట్లతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. దేశంలోని మొత్తం సీట్లలో ఈ 3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 42.80 శాతం సీట్లు ఉన్నాయి. AICTE పరిమితి ఎత్తివేయడంతో దక్షిణాదిలో వచ్చే ఏడాది సీట్లు మరింత పెరగొచ్చు.
News November 13, 2024
ఆ మ్యాచ్ గురించి నేను, కోహ్లీ ఇప్పటికీ చింతిస్తుంటాం: KL రాహుల్
2016 IPL ఫైనల్లో SRHతో సునాయాసంగా గెలిచే స్థితి నుంచి RCB ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ విషయంలో తాను, విరాట్ నేటికీ చింతిస్తుంటామని క్రికెటర్ KL రాహుల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా ఇద్దరిలో ఒకరు ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఫలితం వేరేలా ఉండేది. టేబుల్ అట్టడుగు నుంచి వరుసగా 7మ్యాచులు గెలిచి ఫైనల్స్కు వచ్చాం. బెంగళూరులో ఫైనల్. గెలిచి ఉంటే అదో కల నిజమైన సందర్భం అయ్యుండేది’ అని పేర్కొన్నారు.