News November 10, 2024

ట్రంప్ గెలుపు: భయంతో కెనడాలో హై అలర్ట్

image

ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొన్న కెనడాకు మరో తలనొప్పి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్రమ వలసల భయం పట్టుకుంది. ట్రంప్ తొలి హయాంలో 2017-2021 మధ్య వేలమంది అమెరికా నుంచి కెనడాకు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్‌పై ఉక్కుపాదం మోపుతానని, అక్రమంగా ఎవరున్నా దేశం నుంచి పంపేస్తానని శపథం చేశారు. దీంతో వారంతా సమీపంలోని కెనడాకే వస్తారన్న అంచనాతో ఆ దేశం హైఅలర్ట్ ప్రకటించింది.

Similar News

News December 12, 2024

IND vs AUS మూడో టెస్ట్‌కు వర్షం ముప్పు!

image

BGT 3వ టెస్టు బ్రిస్బేన్ వేదికగా 14న ప్రారంభం కానుంది. అయితే 14-16 వరకు బ్రిస్బేన్‌లో వర్షాలు పడే అవకాశముందని weather.com తెలిపింది. ఇది సిరీస్‌లో తిరిగి పుంజుకోవడానికి ఉన్న ఇండియా అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పింది. ఫ్యాన్స్ 5రోజులు మ్యాచ్ చూసే అవకాశం ఉన్నా.. వర్షం వల్ల ఎక్కువ అంతరాయాలు కలుగుతాయంది. అటు, పిచ్‌లో బౌన్స్ ఉంటుదని, సాధారణంగా గబ్బా ఎప్పుడూ ఫాస్ట్ వికెట్టే అని క్యూరేటర్ చెప్పారు.

News December 12, 2024

చలికాలం అని సరిగా నీరు తాగట్లేదా?

image

చలికాలంలో సాధారణంగా నీరు పెద్దగా తాగాలనిపించదు. ఇలాగైతే సమస్యలొస్తాయని, కాలం ఏదైనా శరీరానికి నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు. నీటి % తక్కువైతే డీహైడ్రేట్ అయి పొడిచర్మం, అలసట, తలనొప్పి వస్తాయంటున్నారు. ప్రత్యామ్నాయంగా జ్యూస్‌, వాటర్ కంటెంట్ ఎక్కువుండే పండ్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే, శీతాకాలం చెమట పట్టక శరీరం నుంచి ఉప్పు బయటకు వెళ్లదు. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించాలని చెబుతున్నారు.

News December 12, 2024

2024: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలివే..

image

ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ2’ తొలి స్థానంలో నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి 2898AD, 12TH FAIL, లాపతా లేడీస్, హనుమాన్, మహారాజ, మంజుమ్మల్ బాయ్స్, గోట్, సలార్, ఆవేశం టాప్-10లో నిలిచాయి.